బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (15:25 IST)

జియాఖాన్ ఆత్మహత్యకు సూరజ్‌ కారణం: ముంబై సెషన్స్ కోర్టు

బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేోసు కీలక మలుపు తిరిగింది. జియాఖాన్ ప్రియుడైన బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలీనే ఆమె ఆత్మహత్యకు కారణమని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. అంతేగాకుండు జియాఖాన్ ఆత్మహత్యకు

బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేోసు కీలక మలుపు తిరిగింది. జియాఖాన్ ప్రియుడైన బాలీవుడ్ హీరో సూరజ్ పంచోలీనే ఆమె ఆత్మహత్యకు కారణమని ముంబై సెషన్స్ కోర్టు స్పష్టం చేసింది. అంతేగాకుండు జియాఖాన్ ఆత్మహత్యకు కారణమైన సూరజ్‌పై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
 
జియా కేసును హత్య కింద చిత్రీకరించాలని జియా తల్లి రబియా ఖాన్ అనుకున్నారని సూరజ్‌ తండ్రి ఆదిత్యా పంచోలీ మీడియాతో అన్నారు. ఈ కేసును ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించిన ప్రతీసారి జియా తల్లి కోర్టు నుంచి స్టే కోరేవారని ఆదిత్య తెలిపారు.
 
జియా కేసు గాడిలో పడిందని.. ఇకపై నిజమైన పోరాటం చేస్తామని చెప్పారు. తమ కుటుంబ సభ్యులు చాలా ఒత్తిడికి గురయ్యారని.. ఒకరికొకరం అండగా వున్నామని.. చిత్ర పరిశ్రమకు చెందిన స్నేహితులు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తమ వెంట వున్నారని ఆదిత్య చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. జూన్ 3, 2013లో జుహు ఫ్లాట్‌లో జియా ఖాన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.