1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 డిశెంబరు 2016 (12:18 IST)

జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం టైటిల్ అదేనా?

జనతా గ్యారేజ్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయ

జనతా గ్యారేజ్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు. సూపర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. 
 
ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించనున్నారు. నట విశ్వరూప అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారు. ఇటీవల స్టార్ హీరోల లీకుల గొడవ ఎక్కువ కావడంతో ఈ సినిమా గురించి అధికార ప్రకటన చేశారు. అదే బాటలో ఎన్టీఆర్ కొత్త సినిమాకు 'నట విశ్వరూప' అనే టైటిల్ నిర్ణయించారన్న టాక్ వినిపిస్తోంది.