శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 డిశెంబరు 2022 (14:22 IST)

నందమూరి ఫ్యామిలీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయింది : జూ ఎన్టీఆర్

jrntr video call
సీనియర్ నటుడు చలపతిరావు మృతిపై హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన మృతి తను ఎంతగానో కలచివేసిందన్నారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో సంతాప సందేశాన్ని విడుదల చేశారు. 
 
"నందమూరి కుటుంబ ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాతగారి రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతిరావు గారు మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన" అంటూ పేర్కొన్నారు.
 
ఇకపోతే, అమెరికాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. చలపతి రావు మృతి వార్త తెలుసుకుని ఆయన కుమారుడు నటుడు రవిబాబుకు వీడియో కాల్ చేశారు. ఈ వీడియో కాల్‌లో లే బాబాయ్ లే.. అంటూ చలపతిరావును పిలుస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.