మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 12 డిశెంబరు 2017 (17:42 IST)

దర్శకేంద్రుడు మెచ్చిన 'మళ్ళీరావా'

శ్రీ నక్కా యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్ళీరావా'. ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ

శ్రీ నక్కా యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరోహీరోయిన్లుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్ళీరావా'. ఈ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మీడియాతో ఈ సినిమా గురించి ముచ్చటించారు. 
 
ఆయన మాట్లాడుతూ.. ''మళ్ళీరావా సినిమా ఇటీవలే చూశాను. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. సుమంత్ నటన నాకు బాగా నచ్చింది. అలాగే కెమెరా, సంగీతపరంగా అన్ని కొత్తగా అనిపించాయి. హీరోయిన్ నటనతో పాటు చిన్నపిల్లలు చాలా బాగా చేశారు. అలాగే ఫస్ట్ టైం దర్శకత్వం వహించిన గౌతమ్‌కు, మరియు ఈ సినిమాతో నిర్మాతగా మారిన రాహుల్ యాదవ్‌కి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఆందరూ చూడాల్సిన సినిమా...'' అని అన్నారు.