శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 7 మే 2017 (14:37 IST)

బాహుబలి-2 తెలుగు సినిమా కాదు: బాలీవుడ్ డైరెక్టర్ కబీర్ ఖాన్

బాహుబలి 2 చిత్ర ప్రభంజనంపై బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ పొగడ్తల వర్షం కురిపించాడు. బాహుబలి తెలుగు చిత్రం కాదని ఇండియన్ సినిమా అంటూ వ్యాఖ్యానించారు. గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్

బాహుబలి 2 చిత్ర ప్రభంజనంపై బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ పొగడ్తల వర్షం కురిపించాడు. బాహుబలి తెలుగు చిత్రం కాదని ఇండియన్ సినిమా అంటూ వ్యాఖ్యానించారు. గత నెల 28వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసి.. కేవలం 9 రోజుల్లోనే రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై కబీర్ ఖాన్ స్పందిస్తూ... బాహుబలి తెలుగు సినిమా కాదని, అది ఇండియన్ సినిమా అని పొగడ్తల వర్షం కురిపించాడు. బాహుబలి విజయం తనకు ఎంతో బలాన్ని, ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. రాజమౌళి బృందం పనితీరుకు తాను ఫిదా అయిపోయానని చెప్పాడు. ఓ ప్రాంతీయ సినిమా భాషా ఎల్లలను చెరిపేసిందని, అందుకు తాను సంతోషంగా ఉన్నానని అన్నాడు. 
 
ఎక్కడైనా ఓ మంచి సినిమా విజయం సాధిస్తే తాను చాలా ఆనందిస్తానని చెప్పుకొచ్చాడు. కాగా, ఈ బాలీవుడ్ డైరెక్టర్... విజయేంద్ర ప్రసాద్ అందించిన 'భజరంగీ భాయీజాన్' కథకు డైరెక్టర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు సల్మాన్ ఖాన్‌తో 'ట్యూబ్ లైట్' చిత్రాన్ని చేస్తున్నాడు. హాలీవుడ్ మూవీ లిటిల్ బాయ్‌కు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా జూన్ 23న విడుదల కాబోతోంది.