సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By

వారెవ్వా కాజల్ ఫిట్నెస్ చూస్తే...

టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ హీరోయిన్లలో ఒకరు కాజల్ అగర్వాల్. ఈ టాలీవుడ్ చందమామ... ఈ మ‌ధ్యకాలంలో ఆమె ఫోటో షూట్స్‌తో అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంటుంది. ఈ యేడాది ప్రారంభంలో ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టిపెట్టిన కాజల్... అందుకు తగినట్టుగా వ్యాయామాలు చేస్తోంది. దీంతో పాటు.. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తోంది. వీటికిదూరంగా ఉండటంతో పాటు.. తన ఫిట్నెస్‌పై మరింత శ్రద్ధ చూపిస్తోంది. 
 
తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ చేసిన వ‌ర్క‌ౌట్ వీడియోని ఆమె త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇందులో కాజ‌ల్ 70 కిలోల బ‌రువు ఎత్తింది. ఫిట్నెస్ పొంద‌డానికి, భారీ బ‌రువులు ఎత్త‌డానికి త‌న కాళ్ళ‌పై ప‌నిచేస్తున్న‌ట్టు పేర్కొంది.
 
"భారీ బ‌రువులు ఎత్త‌డానికి, అంద‌మైన రూపం పొందడానికి చాలా అభ్యాసం చేయాలి, కోచ్ శ్రీరామ్ వ‌ల‌న నాకు విశ్వాసం పెరిగింది. 70 కేజీల బరువు ఎత్తాను. ఇందకా ముందుకు వెళ్ళాలి" అని కాజ‌ల్ వెల్ల‌డించారు. కొద్ది రోజులుగా హాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉన్న కాజ‌ల్ త్వ‌ర‌లో 'ఇండియ‌న్ 2' సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నుంది.