శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Updated : బుధవారం, 22 మే 2019 (16:39 IST)

ఐరన్ లేడీగా మారిన గోల్డెన్ లెగ్ హీరోయిన్..?

టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న సమయంలో నాగచైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని ఇంటి కోడలైంది సమంత. ఇక అక్కినేని కుటుంబంలో నాగార్జున, చై, అఖిల్ అందరూ ఫిట్‌నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ చూపుతుంటారు. ఈ ఇంట్లోకి అడుగుపెట్టగానే సమంత కూడా ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా మారిపోయింది. 
 
తన రోజువారీ కార్యక్రమాలలో వ్యాయామాన్ని కూడా ఓ భాగంగా చేసుకున్న సమంత ఇప్పటికే పలుమార్లు వ్యాయామశాలలో కసరత్తులు చేసున్న వీడియోలు, ఫొటోలను షేర్‌ చేశారు. అయితే తాజాగా ఆమె 100 కిలోలను లిఫ్ట్‌ చేస్తూ స్క్వాట్స్ చేసారు. 
 
ఈ సందర్భంగా తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేశారు. ఇక ఈ వీడియోను చూసాక అభిమానులు ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ‘100 కిలోలను లిఫ్ట్‌ చేయడమంటే మాటలు కాదు, న్యూ ఐరన్‌ లేడీ, దేవుడా... ఎలా చేశావ్‌ సామ్‌, మీరు స్ఫూర్తిదాయకం’ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.
 
ఈ వీడియోకు ప్రతిస్పందనగా సమంత స్నేహితురాలు మల్లిక మైలవరపు ట్వీట్‌ చేశారు. ‘దేవుడా, 100 కిలోలా?.. సమంత ఫీస్ట్‌ టు బీస్ట్‌. ఇది ఎలా సాధ్యమైంది?. నిజంగా చెబుతున్నా.. నీలో ఊహకు అందనంత బలం ఉంది’ అంటూ ఆశ్చర్యపు ఎమోజీలను షేర్‌ చేశారు. ఇందుకు ప్రతిస్పందనగా సామ్‌ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్‌ చేశారు.