ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Modified: శుక్రవారం, 27 అక్టోబరు 2023 (18:30 IST)

ఉలగనాయగన్ కమల్ హాసన్, మణిరత్నం KH234 గ్రాండ్‌గా ప్రారంభం

Kamal
ఉలగనాయగన్ కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం 1987లో విడుదలైన వారి కల్ట్ యాక్షన్ డ్రామా ‘నాయకుడు’ తర్వాత మళ్లీ కలిశారు. 36 సంవత్సరాల తర్వాత లెజెండ్స్ ఇద్దరు #KH234 కోసం తిరిగి జతకట్టారు. ఈ సినిమా ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన ‘బిగిన్ ది బిగిన్’ అనే ప్రోమోలో కమల్ హాసన్, ప్రదీప్ శక్తి మధ్య నాయకన్ ఐకానిక్ సీక్వెన్స్ చూపించారు. ఇది చిత్రం గ్రాండ్ లాంచింగ్ వేడుక  విజువల్స్ కూడా చూపిస్తుంది.
 
కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్‌లు తమ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇద్దరు లెజెండ్స్ కమల్ హాసన్, మణిరత్నంల మ్యాజికల్ కాంబినేషన్‌‌కి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, శర్మిష్ట రాయ్ ప్రొడక్షన్ డిజైన్, అన్బరీవ్ స్టంట్స్ అందించనున్నారు. మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
 
తారాగణం: కమల్ హాసన్
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్, శివ అనంత్
బ్యానర్లు: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్
ప్రెజెంట్స్: ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్
యాక్షన్: అన్బరివ్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: శర్మిష్ట రాయ్