రక్తచరిత్రకి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి పెళ్లి చేస్తే.. #KammaRajyamLoKadapaReddlu
''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న తాజా చిత్రం "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు". తాజాగా ఈ సినిమాలోని చంద్రబాబు లుక్ బయటకు వదిలాడు వర్మ. కన్నీటితో ఉన్న చంద్రబాబు లుక్ వదులుతూ నిజ జీవితంలో ఈ రోల్ ఎవరిదో చెప్పండి అంటూ ట్వీట్ చేశాడు. దీంతో చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున సమాధానాలిస్తున్నారు నెటిజన్లు.
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' షూటింగ్ రెగ్యులర్‌గా జరుగుతున్న వేళ.. రక్తచరిత్రకి, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకి పెళ్లి చేస్తే పుట్టే పిల్లలే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ కొత్త ట్వీట్ చేశాడు. అంతేగాకుండా.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లుకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి..