రామ్ గోపాల్ వర్మ.. ప్రభాస్‌ను ఎందుకు లాగాడు?: శ్వేతారెడ్డి (video)

swetha reddy
Last Updated: బుధవారం, 28 ఆగస్టు 2019 (12:27 IST)
బిగ్ బాస్ హౌస్‌లో క్యాస్టింగ్ కౌచ్ వుందని ఆరోపిస్తూ.. బిగ్ బాస్ నిర్వాహకులు తన పట్ల అన్యాయంగా ప్రవర్తించారంటూ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది శ్వేతారెడ్డి. ఆషోను నిలిపివేయాలని కూడా పట్టుబట్టింది. అయితే ఇవన్నీ ఏమీ ఫలించలేదు. బిగ్ బాస్ షో యధావిధిగా కొనసాగుతూనే వుంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై శ్వేతారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి క్యాస్ట్ ఫీలింగ్ అనే పాటను కూడా రిలీజ్ చేశాడు. ఈ పాటలో ప్రభాస్‌ను కూడా లాగాడు. ఇలా ఆ పాటలో ప్రభాస్‌ను లాగడంపై శ్వేతారెడ్డి స్పందించింది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ప్రమోషన్ కోసం వర్మ ప్రభాస్‌ను లాగాడని శ్వేత తెలిపింది.

అలాగే ప్రభాస్‌ని లాగడం కూడా ప్రమోషన్‌లో ఒక భాగమేనని వెల్లడించింది. ఇంకా, కులం అంటే ఎవరైతే ఊగిపోతారో అలాంటి వారందరి ఫాలోయింగ్ పెంచుకునేందుకు ఆర్జీవీ ఈ ట్రిక్ ప్లే చేశాడనేది తన అభిప్రాయమని శ్వేతారెడ్డి వ్యాఖ్యానించింది.

ఈ వీడియో మొత్తం చూశాక, ఆయన పళ్ళు కొరుకుతూ చెప్పే విధానం చూస్తుంటే తనకు అర్థమైందేమిటంటే.. కులం గురించి ఆర్జీవీ ఒరిజినల్ ఒపీనియన్ ఇది కాదు.. అంటూ శ్వేతారెడ్డి వ్యాఖ్యానించింది.దీనిపై మరింత చదవండి :