సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : ఆదివారం, 8 ఆగస్టు 2021 (19:17 IST)

క‌న‌బ‌డుటలేదు- చాలా బాగా క‌న‌బ‌డుతుందిః రామ్ గోపాల్ వ‌ర్మ

Kanabadutaledu pre release
`క‌న‌బ‌డుట‌లేదు` చాలా బాగా క‌న‌బ‌డుతుంది. కొత్త ద‌ర్శ‌కుడిలా బాల‌రాజు క‌న‌ప‌డ‌టం లేదు. త‌నెందుకు ఈ టైటిల్ పెట్టాడనేది సినిమా చూడాల్సిందే. స్పార్క్ సాగ‌ర్‌లాంటి నిర్మాత దొర‌క‌డం ఈ టీమ్‌కు అదృష్టం. ఎందుకంటే త‌ను ఓసారి క‌మిట్‌మెంట్ ఇస్తే త‌ర్వాత త‌న మాట త‌ను కూడా విన‌డు. వైశాలిరాజ్ చాలా మంచి న‌టి. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. సుక్రాంత్ బాగా యాక్ట్ చేశాడు. అంటూ రామ్‌గోపాల్ వ‌ర్మ శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
సునీల్, సుక్రాంత్‌ వీరెల్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `క‌న‌బ‌డుట‌లేదు`. బాల‌రాజు ఎం ద‌ర్శ‌క‌త్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై సాగ‌ర్ మంచ‌నూరు, స‌తీశ్ రాజు, దిలీప్ కూర‌పాటి, డా.శ్రీనివాస్ కిష‌న్ అన‌పు, దేవీ ప్ర‌సాద్ బ‌లివాడ  ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 13న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌, విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. బిగ్ టిక్కెట్టును ఆవిష్క‌రించారు. 
 
ఈ సంద‌ర్భంగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ ``క‌న‌ప‌డుట లేదు అనే టైటిల్ నన్నెంత‌గానో ఇన్‌స్పైర్ చేసింది`` అన్నారు.
సుక్రాంత్ మాట్లాడుతూ, మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ధు పొన్నాస్ ఈ సినిమాకు అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించారు. సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సాధిస్తుంది. కంటెంట్ బావుంటే సినిమాను ఎలా ఆద‌రిస్తారో మాకు తెలుసు. ఆగ‌స్ట్ 13న మీ ముందుకు రాబోతున్నాం. క‌చ్చితంగా సినిమాను పెద్ద హిట్ చేస్తార‌ని భావిస్తున్నాం అన్నారు.
 
హీరోయిన్ వైశాలి మాట్లాడుతూ ``సినిమాలో న‌టించ‌డం అనేది నా డ్రీమ్‌. చాలా ఎమోష‌న‌ల్‌గా, నెర్వ‌స్‌గా ఉంది. మాట‌లు రావ‌టం లేదు. ఆగ‌స్ట్ 13న థియేట‌ర్స్ ద్వారా మీ ముందుకు వ‌స్తున్నాం. మా క‌న‌బ‌డుట‌లేదు యూనిట్‌ను ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం`` అన్నారు.
 
డైరెక్ట‌ర్ బాల‌రాజు ఎం మాట్లాడుతూ, నాకు సినిమాలంటే పిచ్చి ఏర్ప‌డ‌టానికి కార‌ణం రామ్‌గోపాల్ వ‌ర్మ‌గారు. ఆయ‌న సినిమాలు చూసి సినిమా అంటే ఇష్టం ఏర్ప‌డింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మేకింగ్‌ను, సౌండింగ్‌ను మ‌న సినిమాల‌కు ప‌రిచయం చేసిన తొలి ద‌ర్శ‌కుడాయ‌న‌. అలాగే మ‌న సినిమాల‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయికి క‌థ‌ల రూపంలో ప‌రిచయం చేసిన వ్య‌క్తి ఎవ‌రైనా ఉన్నారా అంటే మ‌న స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారే. స‌క్సెస్‌ఫుల్ సినిమాలు తీస్తేనే స‌క్సెస్ ఏమో అనుకున్నాను. కానీ.. ఓ సినిమాను స‌క్సెస్‌ఫుల్‌గా తీస్తేనే స‌క్సెస్ అని నేను ఈరోజు అనుకుంటున్నాను. ఈ సినిమాకు తుది మెరుగులు దిద్ది ఇక్క‌డ‌కు తీసుకొచ్చిన‌ స్పార్క్ సీఇఓ సాగ‌ర్‌గారికి ఈ సంద‌ర్భంగా స్పెష‌ల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను` అన్నారు.
 
అరుణ్ అదిత్ మాట్లాడుతూ, స్పార్క్‌లాంటి సంస్థ‌లు ఇంకా మ‌రిన్ని రావాలి. అప్పుడే డిఫ‌రెంట్ కంటెంట్‌ను తీసుకురావ‌డానికి స్కోప్ ఉంటుంది. మంచి సినిమాలు తీస్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ప్రేక్ష‌కులు ప్రూవ్ చేశారు. అలాగే ఆగ‌స్ట్ 13న విడుద‌ల‌వుతున్న `క‌న‌బ‌డుట‌లేదు` సినిమాను కూడా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ధు పొన్నాస్ మాట్లాడుతూ ``నా మ్యూజిక్‌ను నాకంటే డైరెక్ట‌ర్ బాల‌రాజుగారే ఎక్కువ‌గా ప్ర‌మోట్ చేయాల‌నుకుంటారు. మంచి టీమ్‌తో ప‌నిచేసినందుకు హ్యాపీగా ఉంది`` అన్నారు.
 
స్పార్క్ ఓటీటీ అధినేత‌, నిర్మాత‌ సాగ‌ర్ మంచ‌నూరు మాట్లాడుతూ, మా స్పార్క్‌లో ఫ‌స్ట్ రిలీజైన మూవీ వ‌ర్మ‌గారు చేసిన `డి కంపెనీ`..అయితే నేను ఫ‌స్ట్ సైన్ చేసిన మూవీ `క‌న‌బ‌డుట‌లేదు`. చాలా స్పెష‌ల్ కేర్ తీసుకున్నాం. వైశాలి రాజ్‌ తొలి సినిమా హీరోయిన్‌లా కాకుండా మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ చేసింది. క‌థ‌లో చాలా బ‌ల‌ముంద‌నిపించ‌డంతో సినిమాను ఇంకా పెద్ద లెవ‌ల్‌లో చేయాల‌నిపించింది. అప్పుడే సునీల్‌, హిమ‌జ‌, ర‌వివ‌ర్మ‌గారిని టీమ్‌లోకి యాడ్ చేసుకున్నాం. అన్నారు.