శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 ఆగస్టు 2015 (13:18 IST)

వామ్మో.. రోజుకు 8 గంటల చొప్పున 3 రోజుల పాటు లిప్ కిస్‌లో ఇమ్రాన్-కంగనా..?

రొమాంటిక్ కామెడీ చిత్రం ''కట్టి బట్టి''లో ఓ పాట కోసం బాలీవుడ్ స్టార్స్ ఇమ్రాన్ ఖాన్, కంగనా రనౌత్ రోజుకు 8 గంటల పాటు లిప్ కిస్‌లో అలానే ఉండిపోయారట. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కట్టి బట్టిలో లిప్ టు లిప్ కిస్సియాన్ అనే పాట చిత్రీకరణలో శరవేగంగా జరుగుతోంది. ఈ పాట కోసం రోజుకు 8 గంటల చొప్పున మూడు రోజుల పాటు కంగనా రనౌత్, ఇమ్రాన్ ఖాన్ పెదవులు కలిపారట. ఈ విషయాన్ని నిర్మాతలే వెల్లడించారు. 
 
'లిప్ టు లిప్ కిస్సియాన్' అనే పాట చిత్రీకరణను ఇండియాలో తొలిసారిగా స్టాప్ మోషన్ టెక్నాలజీలో చిత్రీకరించామని, హీరో హీరోయిన్లు ఈ పాటలో చాలా ప్రొఫెషనల్స్‌గా నటించారని నిర్మాత వెల్లడించారు. ఇమ్రాన్, కంగనా సహకారంతో పాట చాలా బాగా వచ్చిందని తెలియజేశారు. 
 
రొమాంటిక్ కామెడీతో పాటు మిస్టరీ, లవ్ చిత్రంలో ప్రధానాంశాలని తెలిపారు. కాగా, ఈ చిత్రం వచ్చే నెల 18న విడుదల కానుంది. మరి కంగనా, ఇమ్రాన్ లిప్ లాక్ ఏ రేంజ్‌లో ఉంటుందో సినిమా చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పటికే ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.