ఓటీటీలు పోర్న్ సైట్లు వంటివి... లైంగిక కంటెంట్‌తో ఆకర్షించలేం... కంగనా రనౌత్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఓటీటీలన పోర్న్ వెబ్‌సైట్లతో పోల్చింది. పైగా లైంగిక కంటెంట్‌తో ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడం కష్టమని జోస్యం చెప్పింది.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో దేశ వ్యాప్తంగా సినిమా హాళ్లు మూతపడివున్న విషయం తెల్సిందే. అన్‌లాక్ చర్యల్లో భాగంగా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే, కోవిడ్ నిబంధనలు తుచ తప్పకుండా పాటించాలని ఆంక్షలు విధించింది.
దీంతో అనేక మంది నిర్మాతల తమ చిత్రాలను ఓటీటీ వంటి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లలో విడుదల చేస్తున్నారు. వీటిపై కంగనా రనౌత్ స్పందించారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
డిజిటల్ మాధ్యమం ఈరోస్ నౌ సంస్థ సల్మాన్‌ఖాన్, రణవీర్ సింగ్, కత్రినాకైఫ్‌లతో ఉన్న మీమ్స్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత తొలగించేసింది. అయితే ఈ వ్యవహారంపై కంగనా మాత్రం మండిపడింది.
డిలీట్ చేసిన మీమ్ ఫోటోను తన ట్విట్టర్‌లో షేర్ చేసిన కంగనా రనౌత్ ఓటీటీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. "సినిమాను థియేటర్‌లో చూసే ప్రేక్షకులను మనం కాపాడుకోవాలి. లైంగిక కంటెంట్‌తో ఎక్కువమంది ప్రేక్షకులను ఆకర్షించడం కష్టం. డిజిటలైజేషన్‌లో కళ పెద్ద సంక్షోబాన్ని ఎదుర్కొంటోంది. స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్స్ పోర్న్ హబ్స్ తప్ప మరేమీ కావు" అని అన్నారు కంగనా.