కరీనా కపూర్ ప్రెగ్నెంట్ వార్తలు... లండన్ ట్రిప్ అందుకు కాదు.. విశ్రాంతి కోసమే!
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కరీనా కపూర్ తల్లి కాబోతుందంటూ మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. బిటౌన్లో కరీనా కపూర్ ప్రెగ్నెంట్ అనే విషయంపై హాట్ హాట్‌గా చర్చ సాగింది. ఈ వార్తలపై కరీనా కపూర్ స్పందించింది.
తాను ప్రెగ్నెంట్ కాదని, ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేసింది. తల్లి కావడం ఓ వరం లాంటిదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి గర్భవతి అయ్యే యోచన లేదని స్పష్టం చేసింది.
కరీనా కపూర్ విశ్రాంతి కోసమంటూ లండన్ వెళ్లింది. ఓ ఆంగ్లపత్రిక కరీనా కపూర్ ప్రెగ్నెంట్ వార్తలను తొలుత ప్రచురించింది. ఈ వార్తపై బిటౌన్‌లో హాట్ హాట్‌గా చర్చ సాగిన తరుణంలో కరీనా ఖండించింది.
ఆమె మూడునెలల పాటు గర్భం ధరించినట్లు వెబ్ సైట్లు ఇష్టానుసారం రాశాయి. తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి లండన్‌కు విశ్రాంతి కోసం వెళ్ళానే తప్ప.. ఈ ట్రిప్‌లో కొత్త విషయం లేదని చెప్పింది.