1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2016 (11:54 IST)

కాష్మోరాలో నయనతార లుక్.. రత్నమహాదేవిగా సింహాసనంపై కూర్చుని...

కార్తీ-నయనతార జంటగా రానున్న మూవీ కాష్మోరా. తాజాగా కార్తీ లుక్‌కి ఇప్పటికే మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుతం నయనతార లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో నయనతార రత్నమహాదేవి రోల్‌లో క

కార్తీ-నయనతార జంటగా రానున్న మూవీ కాష్మోరా. తాజాగా కార్తీ లుక్‌కి ఇప్పటికే మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుతం నయనతార లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో నయనతార రత్నమహాదేవి రోల్‌లో కనిపించనుంది. తాజాగా రిలీజైన పోస్టర్‌లో ఈమె సింహాసనంపై కూర్చొని కాసింత గాంభీర్యంగా కనిపించింది. ఈ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 
 
ఇంతకీ స్టోరీ ఏంటి అనే దానిపై చర్చ మొదలైంది. కాష్మోరాలో కార్తీ ట్రిపుల్ షేడ్‌లో అంటే సైనికాధికారి, గూఢచారిగా, నేటితరం యువకుడిగా మూడు భిన్నమైన క్యారెక్టర్స్ చేస్తున్నాడన్నమాట. దాదాపు షూటింగ్ ఫినిష్ కావడంతో నటీనటుల పిక్స్‌ని ఒకొక్కటిగా బయటపెడుతోంది యూనిట్. గోకుల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ శ్రీదివ్య కూడా కనిపిస్తోంది.