మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (02:51 IST)

కాటమ రాయుడు వచ్చినాడు.. సీమ సందుల్లో తిరిగాడు.. పోస్టర్‌లో మెరిసినాడు.

రాయుడూ... వచ్చేశాడు. కాటమరాయుడు వచ్చేశాడు.. పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా తొలి టీజర్ విడుదలైంది. పవన్ కల్యాణ్ నేపథ్యంలో కౌబాయ్ ట్యూన్‌తో ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు. ఎవడున్నాడన్నది ముఖ్యం అనే పంచ్ డైలాగ్‌తో పవన్ కల్యాణ్ తొలి టీజర్ అదరగొట్ట

రాయుడూ... వచ్చేశాడు. కాటమరాయుడు వచ్చేశాడు.. పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా తొలి టీజర్ విడుదలైంది. పవన్ కల్యాణ్ నేపథ్యంలో కౌబాయ్ ట్యూన్‌తో ఎంతమందున్నారన్నది ముఖ్యం కాదు. ఎవడున్నాడన్నది ముఖ్యం అనే పంచ్ డైలాగ్‌తో పవన్ కల్యాణ్ తొలి టీజర్ అదరగొట్టింది. తన మార్కు లుంగీతో, కత్తివాదరలాంటి చూపుల్తో, తన వెనుక ఏదో జరగబోతోందన్న కుతూహలం కలిగిస్తూ కాటమరాయుడు వచ్చేశాడు. 
 
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో మరొక అద్భుతమైన మాస్ అప్పీలుతో పవన్ కల్యాణ్ టీజర్ సాక్షిగా సవాల్ చేస్తూ వచ్చాడు. అత్తారింటికి దారేది సినిమాలోని రన్ చేజ్ దృశ్యాలు, రైల్వే స్టేషన్‌లో హై వోల్టేజ్ డ్రామాతో కూడిన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ పవర్ స్టార్ 2017 బ్లాక్ బస్టర్ మూవీగా కాటమరాయుడు నిలిచి తీరుతుందన్న హామీ కల్పిస్తూ పవన్ వచ్చేశాడు. 
 
ఇలాంటి ఫ్యాక్షనిస్టు అవతారంలో పవన్ కనిపించడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో కుతూహలం అంబరాన్నంటుతోంది. 
 
తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం వీరమ్‌నే కాటమరాయుడు పేరుతో రీమేక్ చేస్తున్నారని తెలిసిందే. పవన్ ఈ సినిమాలో పక్కా ప్యాక్షనిస్టు కాగా శ్రుతిహాసన్ హీరోయిన్గా జతకడుతోంది. ఈ నెలలో షూటింగ్ పార్ట్ పూర్తవుతున్నందున మార్చి నెలలో ఉగాది పండుగకు సినిమా విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. 
 
పవన్ కల్యాణ్ మరొక రెండు సినిమాల్లో నటించనుండటంతో  రాజకీయాలకు కాస్త విరామం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరొక తమిళ చిత్రం రీమేక్ కూడా పవన్ ఆమోద ముద్ర  వేసాడని సమాచారం. ఆర్‌టి నేసన్స్ దర్శకత్వంలో వేదాలం సినిమాలో అజిత్ పాత్రను పవన్ పోషించనున్నాడు. ఈ సంవత్సరంలోనే సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. 
 
ఇది కాకుండా ప్రసిద్ధ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొక ప్రాజెక్టుకు కూడా పవన్ సంతకం చేయడం తెలిసిందే.