శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (11:43 IST)

సంక్రాంతికి డిజిజల్‌ పోస్టర్‌తో సరిపెట్టుకున్న "కాటమరాయుడు"

డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, ఈ నెల 14వ తేదీన ఈ సినిమా నుంచ

డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమా షూటింగ్‌ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, ఈ నెల 14వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ఈ సినిమా టీమ్‌ చెప్పింది.
 
దాంతో పవన్‌ అభిమానులంతా ఆత్రుతగా ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ రోజున ఈ టీజర్‌‌ను విడుదల చేయడం లేదనేది తాజా సమాచారం. కొన్ని కారణాల రీత్యా ఆ రోజున టీజర్‌‌ను రిలీజ్‌ చేయలేకపోతున్నామనీ, ఆ రోజున డిజిటల్‌ పోస్టర్‌ను మాత్రం వదులుతామని చెప్పారు. ఈనెల 26వ తేదీన ఫస్టు టీజర్‌ను రిలీజ్‌ చేస్తామని అన్నారు. కనుక అప్పటివరకూ పవన్‌ ఫ్యాన్స్‌ వేచి ఉండవలసిందే.