గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (11:46 IST)

ఎగిసిపడే అలలపై కత్రినా కైఫ్ ఏం చేసిందోచూడండి..

బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్. వ‌య‌స్సు పెరిగిన వ‌న్నె త‌ర‌గ‌ని అందం ఈమె సొంతం. ఈ అమ్మ‌డు తాజాగా 'జ‌గ్గా జాసూస్' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో క‌త్రినా న‌ట‌నికి మంచి మార్కులు

బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్. వ‌య‌స్సు పెరిగిన వ‌న్నె త‌ర‌గ‌ని అందం ఈమె సొంతం. ఈ అమ్మ‌డు తాజాగా 'జ‌గ్గా జాసూస్' అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో క‌త్రినా న‌ట‌నికి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే జ‌గ్గా జాసూస్ సినిమా షూటింగ్‌తో పాటు ప్ర‌మోష‌న్ కోసం హాలీడేస్‍‌‌కి దూరంగా ఉన్న ఈ భామ సినిమా రిలీజ్ కావ‌డం ఆల‌స్యం వెంట‌నే మొరాకోలో ప్ర‌త్య‌క్షమైంది. 
 
అక్కడ అంద‌మైన ప్ర‌దేశాలని చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అయితే క‌త్రినా తాజాగా ఓ స‌ర్ఫింగ్ వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చింది. ఎగిసిప‌డే అల‌ల‌పై స‌ర్ఫింగ్ చేస్తూ మస్తుగా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఓ స‌హాయ‌కుడి స‌మ‌క్షంలో క‌త్రినా స‌ర్ఫింగ్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఆ వీడియో మీరూ తిలకించండి.