శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 నవంబరు 2017 (20:06 IST)

పవన్ కళ్యాణ్ తెర వెనుక వేరే టైపు... కిసుక్కున నవ్వుతూ కీర్తి సురేష్

ట్విట్టర్లో ఫస్ట్ లుక్ తోనే దుమ్ము రేపుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లుక్స్ అదుర్స్ అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ఇదిలావుంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్ చిత్రంలో నటించినప్పటి జ్ఞాపకాలను ఓ ఆంగ్ల పత్ర

ట్విట్టర్లో ఫస్ట్ లుక్ తోనే దుమ్ము రేపుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ లుక్స్ అదుర్స్ అని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. ఇదిలావుంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కీర్తి సురేష్ చిత్రంలో నటించినప్పటి జ్ఞాపకాలను ఓ ఆంగ్ల పత్రికతో షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ నేరుగా చూసేందుకు అలా వుంటారు కానీ తెర వెనుక వేరే టైపంటూ కిసుక్కున నవ్వింది. 
 
ఆయన తెర వెనుక వేసే జోక్స్ వింటే పొట్ట చెక్కలవుతుందనీ, ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కలిస్తే ఇక అక్కడ నవ్వులే నవ్వులని చెప్పుకొచ్చింది. నాతో పాటు నా సహచర నటీనటులంతా బాగా ఎంజాయ్ చేశామని తెలిపింది. తనకు పవన్ 25వ చిత్రంలో అవకాశం రావడం ఎంతో అదృష్టమని చెప్పుకుంది. ఇకపోతే కీర్తి సురేష్ ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా వున్నది.