బుధవారం, 30 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శుక్రవారం, 3 జూన్ 2016 (17:50 IST)

పవన్ కల్యాణ్‌కు నో చెప్పింది.. నానితో నటించేందుకు సై అంది.. ఎవరా హీరోయిన్?!

రామ్‌తో 'నేను శైలజ' సినిమాలో నటించిన నటి కీర్తి సురేష్‌కు తెలుగులో ఆఫర్లు వస్తున్నాయి. తమిళంలో కూడా తను నటించిన మొదటి సినిమా హిట్‌ కావడంతో అక్కడ కూడా అమ్మడుకి క్రేజీ ఆఫర్స్‌ వస్తున్నాయి. దీంతో తెలుగులో సినిమాలు ఒప్పుకోకుండా కోలీవుడ్‌ కే తన ప్రిఫరెన్స్‌ ఇస్తోంది. తమిళంలో విజయ్‌, ధనుష్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. 
 
ఈసారి నానితో కొత్త సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా పవన్‌ కళ్యాణ్‌తో నటించేందుకు ఆఫర్‌ వచ్చినా.. కొన్ని కారణాలవల్ల ఒప్పుకోలేదని తెలిసింది. అయితే.. దిల్‌రాజు నిర్మాణసారథ్యంలో నానితో తీసే సినిమాలో ఆమె అంగీకరించడం విశేషం. సినిమా చూపిస్తమామ.. దర్శకుడు త్రినాధరావు నక్కిన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.