గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జనవరి 2021 (18:36 IST)

పెళ్లి వద్దంటూ మొండికేస్తున్న 'మహనటి' (video)

తెలుగు చిత్రపరిశ్రమలో మహానటిగా గుర్తింపు పొందిన హీరోయిన్ కీర్తి సురేష్. ఈ ఒక్క సినిమా ఈ మలయాళ భామ దశ తిరిగిపోయింది. మహానటి తర్వాత ఆమె నటనకు మెచ్చి వరుస ఆఫర్లు వస్తున్నాయి. 
 
ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ మాత్రమే కాదు, గ్లామరస్ టచ్ కూడా ఇస్తూ కెరియర్‌లో బిజీ బిజీగా ఉంది. అయితే కెరియర్ పీక్స్‌లో ఉన్న ఈ టైమ్‌లోనే తనకు పెళ్లి పేరుతో కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. కీర్తి వయసు ప్రస్తుతం 28 ఏళ్లు కాగా, తనకు 30 ఏళ్లలోపే పెళ్లిచేసేయాలని ఆమె పేరెంట్స్ డిసైడ్ అయ్యారట. 
 
కానీ కీర్తి మాత్రం ఇప్పుడప్పుడే మ్యారేజ్ వద్దని, ఇంకొన్నాళ్లు సినిమాల్లో కొనసాగుతానని బెట్టు చేస్తున్నట్టు టాక్. కానీ పేరెంట్స్ పట్టుబడుతుండటంతో.. స్ట్రెస్ ఫీల్ అవుతోందని సమాచారం. కాగా గతంలో బీజేపీ లీడర్ కొడుకుతో కీర్తి మ్యారేజ్ అని వెలువడిన వార్తలను కీర్తి ఖండించిన విషయం తెలిసిందే.
 
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న కీర్తి.. యంగ్ స్టార్ నితిన్‌తో 'రంగ్ దే'లో రొమాన్స్ చేయబోతోంది. అంతేకాదు తలైవా రజనీకాంత్ 'అన్నాత్త' సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించబోతుంది.