శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (12:45 IST)

మలయాళ దర్శకుడు లిజు కృష్ణ అరెస్ట్.. రేప్ కేసులో యువతి ఫిర్యాదుతో..?

Liju krishna
మలయాళ దర్శకుడు లిజు కృష్ణను రేప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతి ఫిర్యాదు మేరకు లిజు కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి  ఫిర్యాదు మేరకు లిజు కృష్ణపై ఐపిసి 376 సెక్షన్ కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
దర్శకుడిపై ఫిర్యాదు చేసిన యువతి సినీ పరిశ్రమకు చెందినది కాదు. అలాగే ఆమెతో లిజు కృష్ణకు కొన్నాళ్లుగా పరిచయం ఉంది". లిజు కృష్ణ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.  సోమవారం కొచ్చిలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
 
కాగా మలయాళ చిత్రం పడవెట్టుతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు లిజు కృష్ణ. పడవెట్టు షూటింగ్ దశలో ఉండగా అతను వివాదంలో ఇరుక్కున్నాడు. 
 
లిజు కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పడవెట్టు' మూవీ ఈ సంవత్సరం చివర్లో విడుదల కానుందని, ఈ మూవీలో మంజు వారియర్, నివిన్ పౌలీ వంటి నటులు కీలక రోల్స్ చేస్తున్నారు. 
 
లిజు కృష్ణ స్వస్థలమైన కన్నూర్‌లో పడవెట్టు మూవీ  షూటింగ్ చేస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.