శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మే 2021 (15:31 IST)

కేజీఎఫ్ చాప్టర్ 2 అప్డేట్.. సినిమా డ్యూరేషన్ గురించి..?

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ షేక్ చేశాడు రాకింగ్ స్టార్ యష్. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు పార్ట్ 2 రాబోతోంది.
 
దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వస్తోందీ సినిమా. ఈ సినిమాలో రాకీ భాయ్‌ను ఢీ కొట్టేందుకు అధీరాగా వస్తున్నాడు బాలీవుడ్‌ హీరో సంజయ్‌దత్‌. 
 
మరో బాలీవుడ్ నటి రవీనాటాండన్ కీలక పాత్రలో నటిస్తుంది. కేజీఎఫ్ ఛాప్ట‌ర్ 1 భారీ విజ‌యం సాధించ‌డంతో ఛాప్ట‌ర్ 2పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ప్ర‌కాశ్ రాజ్, రావు ర‌మేష్ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.
 
అయితే ఇదివరకే గ్లింప్స్‌తో పాటుగా కేజీఎఫ్-2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు ఈ సినిమా అనుకున్న టైంకి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుపుతున్నారు  చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా డ్యూరేషన్ గురించి ఇంటరెస్టింగ్ చర్చ జరుగుతుంది. ఈ సినిమా డ్యూరేషన్ 2 గంటల 52నిముషాలు ఉన్నట్లు తెలుస్తుంది.
 
ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. ఈ సినిమా తోపాటు మరోవైపు ప్రభాస్‌తో సలార్ సినిమాను కూడా చేస్తున్నాడు. ఆసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.