శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 మే 2021 (12:09 IST)

మెగాస్టార్ ఫ్యామిలీనే బీట్ చేసిన వంటలక్క.. ఏం చేసిందో తెలుసా?

బుల్లితెరపై వంటలక్కకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ క్రేజ్ మెగాస్టార్ ఫ్యామిలీనే బీట్ చేసింది. ఎలాగంటే.. మెగాస్టార్ చిరంజీవి నుండి ఇటీవలే ఉప్పెన సినిమాతో పరిచయమైన వైష్ణవ్ తేజ్ వరకు ఈ కుటుంబానికి మంచి క్రేజ్ ఉంది. 
 
ఇక వీళ్లు నటించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క సినిమాను మంచి సక్సెస్‌తో వాళ్ల ఖాతాలో నింపుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీకి వంటలక్క వల్ల డిమాండ్ తగ్గిందని తెలుస్తుంది.
 
వంటలక్క అంటే బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ అంటే తెలియనివారు లేరు. 2017 అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటికీ మంచి క్రేజ్‌తో దూసుకెళ్తోంది. ఈ సీరియల్ లో దీప, కార్తీక్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక అనుమానం వల్ల వీరిద్దరు విడిపోయారు. 
 
ఇక ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉన్న ఈ జంట.. ఎప్పుడు కలుస్తారా.. అని ప్రేక్షకులు ఎదురు చూడని రోజే లేదు. ఇక ప్రస్తుతం దీప అనారోగ్యం బాలేనందున కార్తీక్.. ఆమెకు దగ్గరగా అవడంతో ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. ఇక దీంతో ప్రేక్షకులు ఈసారి సీరియల్ సమయం కాక ముందుకే వెళ్లి టీవీల ముందు వాలిపోతున్నారు. ఇక ఈ సీరియల్ రేటింగ్ విషయంలో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది.
 
ఇటీవలే విడుదలైన ఉప్పెన సినిమా బుల్లి తెర స్టార్ మాలో ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన సంగతి తెలిసిందే. 
 
ఇక స్టార్ మాలో ప్రసారమైన ఈ సీరియల్ రేటింగ్ విషయంలో 13320లో ఉండగా.. ఇక అదే స్టార్ మా లో ప్రసారమయ్యిన వంటలక్క సీరియల్ కార్తీకదీపం ఆ రోజు 14053 రేటింగ్‌తో పై స్థానంలో ఉంది.
 
థియేటర్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రికార్డు సాధించుకున్న ఉప్పెన సినిమా.. బుల్లితెరలో ప్రసారం అవ్వగా ఏకంగా వంటలక్క సీరియల్ కంటే తక్కువ రేటింగ్ సాధించుకుంది. 
 
ఈ రేటింగ్‌ను చూస్తే మెగా కుటుంబాన్ని వంటలక్క తన రేటింగ్‌తో తగ్గించేసిందని అర్థమవుతుంది. మొత్తానికి అన్ని సీరియల్‌లో కంటే పై స్థానంలో ఉన్న వంటలక్క సీరియల్.. ఏకంగా వెండితెరలో అది కూడా మెగా ఫ్యామిలీతో పోటీతో పై స్థానంలో ఉందని అర్థం అవుతుంది.