గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (11:50 IST)

'ఖైదీ నం.150' సాంగ్ : 24 గంటల్లో 20 లక్షల మంది వీక్షించారు... చాలా థ్యాంక్స్ : డీఎస్పీ

సుదీర్ఘకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ చిత్రంలోని టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, తాజాగా ఓ పాటను రిలీజ్ చేశారు. 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' అనే పాటను ఆదివారం స

సుదీర్ఘకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ చిత్రంలోని టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, తాజాగా ఓ పాటను రిలీజ్ చేశారు. 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' అనే పాటను ఆదివారం సాయంత్రం 6 గంటలకు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. 
 
ఈ పాట విడుదల చేసిన 24 గంటల్లో 20 లక్షల వ్యూస్ సాధించిందని ఆ చిత్రబృందం ప్రకటించింది. ఆదివారం విడుదల చేసిన ఈ పాట అభిమానులను విశేషంగా అలరించిందని, దీనికి కేవలం 24 గంటల్లోనే 20 లక్షల వ్యూస్ వచ్చాయని ఈ చిత్రబృందం తెలిపింది. 24 గంటల్లో 2 మిలియన్ల వ్యూస్ సాధించిన సినిమాపాట కూడా ఇదేనని కూడా ఆ చిత్రయూనిట్ పేర్కొంది. ఇంత పెద్ద ఘనత సాధించేందుకు కారణమైన అభిమానులకు సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ ధన్యవాదాలు తెలిపాడు. 
 
కాగా, 'అమ్మడు లెట్స్ గో కుమ్ముడు' పాటను ఆలపించింది దేవీశ్రీప్రసాద్, రాణినారెడ్డి. కొణిదెల పతాకంపై చిరంజీవి తనయుడు హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల మందుకు రానుంది.