'ఖైదీ నంబర్ 150' టిక్కెట్ ధరతో పోటీపడలేని 'గౌతమిపుత్ర శాతకర్ణి' టిక్కెట్...
సంక్రాంతి బరిలో నిలిచిన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలకు చెందిన టిక్కెట్ ధరలు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోతున్నాయి. బుధవారం విడుదలైన ఖైదీ చిత్ర టిక్కెట్లు రూ.లక్షల్లో అమ్ముడు పోయిన విష
సంక్రాంతి బరిలో నిలిచిన ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలకు చెందిన టిక్కెట్ ధరలు రికార్డు స్థాయి ధరలకు అమ్ముడుపోతున్నాయి. బుధవారం విడుదలైన ఖైదీ చిత్ర టిక్కెట్లు రూ.లక్షల్లో అమ్ముడు పోయిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి చెందిన మూడు టిక్కెట్లు ఏకంగా రూ.36 లక్షలకు అమ్ముడుపోయాయి.
కానీ, నందమూరి బాలయ్య 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' గురువారం అభిమానుల ముందుకు వచ్చింది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో ఈ సినిమా బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. అంతేకాక ఈ థియేటర్‌కి బాలయ్య కూడా రానున్నడంతో అభిమానులలో మరింత ఉత్సాహం పెరిగింది.
బాలయ్యతో కలిసి సినిమా చూసేందుకు గోపీచంద్ అనే అభిమాని టికెట్ కోసం ఏకంగా రూ.1,00,100 పెట్టి కొన్నాడు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి విరాళంగా ఇచ్చేందుకు రూ.1,00,100 పెట్టి టికెట్ కొన్నట్లు ఆయన తెలిపారు. ఈ థియేటర్‌లోనే బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్, రాజమౌళి, కొరటాల శివ ముందస్తు చిత్రాన్ని వీక్షించారు.