శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (17:11 IST)

శ్రీదేవి మరణంపై దుబాయ్ పత్రిక 'ఖలీజ్ టైమ్స్' సంచలన కథనం

నటి శ్రీదేవి మరణంపై దుబాయ్‌కు చెందిన ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయంటూ పేర్కొంది.

నటి శ్రీదేవి మరణంపై దుబాయ్‌కు చెందిన ఖలీజ్ టైమ్స్ అనే పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయంటూ పేర్కొంది. శ్రీదేవి బాత్ టబ్‌లో నిర్జీవంగా పడిపోయారా? స్నానం చేస్తున్నప్పుడే ఆమె గుండె ఆగిపోయి చనిపోయారా? అంటూ పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఈనెల 24వ తేదీ శనివారం రాత్రి హోటల్ గదిలోని బాత్‌ రూంలో స్నానం చేస్తూ ఆమె అచేతనంగా పడి చనిపోయినట్లు ఆ పత్రిక కథనం.
 
అదేసమయంలో అసలు దుబాయ్‌లో ఏం జరిగిందన్న దానిపై కూడా ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి దాదాపు నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. ముంబైలో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుక కోసం వెనక్కి వచ్చిన బోనీకపూర్ మళ్లీ శనివారం మధ్యాహ్నం దుబాయ్ చేరుకుని శ్రీదేవి బస చేసిన 'జువైరా ఎమిరేట్స్ టవర్స్' హోటల్‌కు వెళ్లి ఆమెను ఆశ్చర్య పరిచారు. శ్రీదేవిని సాయంత్రం 5:30 గంటల సమయంలో నిద్రలేపారు. ఎప్పుడొచ్చారు అని ఆశ్చర్చపోయిన శ్రీదేవి దాదాపు ఆయనతో 15 నిమిషాలు మాట్లాడారు. 
 
ఇద్దరు కలిసి డిన్నర్‌కు వెళ్లాలని నిర్ణయించుకోవడంతో స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీదేవి బాత్‌రూంలోకి వెళ్లారు. దాదాపు పావుగంటైనా ఆమె బాత్ రూం నుంచి బయటకు రాలేదు. దాంతో అనుమానం వచ్చిన బోనీ కపూర్ తలుపుతట్టారు. లోపల నుంచి మాట వినిపించలేదు. అలకిడి లేదు... స్నానం చేస్తున్న శబ్దం లేదు. దాంతో హోటల్ సిబ్బంది సాయంతో బోనీ కపూర్ తలుపు పగలకొట్టి చూశారు. బాత్ టబ్‌లో శ్రీదేవి అచేతనంగా పడి ఉండటం కనిపించింది. బోనీకపూర్‌ ఆమెను బతికించుకోవడానికి ప్రయత్నం చేశారని ఆ పత్రిక పేర్కొంది. 
 
దీన్ని బట్టి శ్రీదేవి రాత్రి 11:30 నిమిషాల సమయంలో చనిపోలేదని, ముందే 7:30 గంటలకు చనిపోయిందని ఖలీజ్ టైమ్స్ పత్రిక కథనం. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె భౌతికకాయాన్ని పోస్టుమార్టం చేసేందుకు తీసుకెళ్లారు. మరో కథనం ప్రకారం శ్రీదేవి చనిపోయే సమయానికి బోనీ కపూర్ ఆమెతో లేరనే ప్రచారం జరుగుతోంది. దాంతో అసలు ఏం జరిగిందనే అనుమానాలు పెరిగిపోయాయి.