మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (15:53 IST)

గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా కిరణ్ అబ్బవరం సమ్మతమే విడుదల

Chandni Chowdhary, Kiran Abbavaram
Chandni Chowdhary, Kiran Abbavaram
హీరో కిరణ్ అబ్బవరం "సమ్మతమే" చిత్రం జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా  విడుద‌ల‌కు  సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, రేపు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
 
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ని సొంతం చేసుకోవడంతో 'సమ్మతమే' సేఫ్ హాండ్స్ లోకి వెళ్ళింది. సినిమా అన్ని ప్రాంతాలలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
 
గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోంది. విడుదలకు ముందే 'సమ్మతమే' పాజిటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంటుంది. టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా పాటలకు కూడా మంచి ఆదరణ లభించింది.
గోపీనాథ్ రెడ్డి ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించగా, శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
యుజి ప్రొడక్షన్స్  బ్యానర్ పై కంకణాల ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
తారాగణం: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి తదితరులు.
టెక్నికల్ టీమ్ :
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి
నిర్మాత: కంకణాల ప్రవీణ
బ్యానర్: యూజీ ప్రొడక్షన్స్
సంగీతం: శేఖర్ చంద్ర
డీవోపీ: సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్: విల్పవ్ నైషదం
ఆర్ట్ డైరెక్టర్: సుధీర్ మాచర్ల