సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (07:45 IST)

ఎన్‌.టి.ఆర్‌.దేవర గురించి తాజా అప్డేట్ ఇచ్చిన కొరటాల శివ

devara latest
devara latest
దేవర కథ రాసుకున్నప్పుడు, ఎన్‌.టి.ఆర్‌.గారికి నెరేట్‌ చేసినప్పుడు అందరం తెలీని ఎగ్జైట్‌మెంట్‌ ఫీలయ్యాం అని దర్శకుడు  కొరటాల శివ అన్నారు. ఈరోజు అక్టోబర్ 5న ఆయన ప్రకటన చేశారు. దేవరలో ఎక్కువ పాత్రలు, పవర్‌పుల్‌ పాత్రలు వున్నాయి. షూటింగ్‌ మొదలుపెట్టాక చాలా అద్భుతంగా ఫీలయ్యాం. ప్రతి ఎపిసోడ్‌ ఇచ్చే ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. మూడు షెడ్యూల్స్‌ అయ్యాక అందరం ఎడిటింగ్‌లో చూసుకున్నా ఇంకా చాలా హ్యాపీగా వున్నాం.

అయితే ఇందులో ఒక్కసీన్‌కానీ, డైలాగ్‌ కూడా తీయలేం అని భావించాం. అందుకే ఆదరాబాదరాగా సినిమాను ముగించకూడదు. కనుక అందరి కష్టాన్ని డెప్త్‌గా చూపించాలని రెండు భాగాలుగా చెప్పాలని నిర్ణయం తీసుకున్నాం.
 
రెండు భాగాలుగా చేయాలని మొన్ననే నిర్ణయం తీసుకున్నాం. ఫ్యాన్స్‌కూ, మూవీ ప్రేమికులకు తెలియజేస్తున్నాం. కోస్టల్‌ ఇండియాలో వెరీ స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ మధ్య భయంతో కూడిన ఎమోషన్స్‌తో కూడిన దేవర రెండు భాగాలుగా చెప్పుబోతున్నాం. ఏప్రిల్‌ 5, 2024 పార్ట్‌`1 విడుదల చేస్తున్నామని వెల్లడించారు. అల్లాగే దేవర టీమ్ ఎన్‌.టి.ఆర్‌, ప్రశాంత్ నీల్ సినిమా విడుదల కూడా ప్రకటించింది. 
Devara Part 1  5-4-2024   War2     24-1-2025  NTRNeel     Aug -2025  Devara Part 2 Summer -2026