బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (19:18 IST)

32 ఏళ్ళ తర్వాత రజనీకాంత్‌, అమితాబ్‌ కాంబినేషన్‌లో తలైవర్‌ 170 సినిమా ప్రారంభం

Thalaivar 170 jyoti
Thalaivar 170 jyoti
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జైలర్‌ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వెంటనే మరో సినిమాను లైన్‌లో పెట్టారు. తలైవర్‌170 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను త్రివేండ్రంలో బుధవారంనాడు దేవునిపూజతో ప్రారంభమైంది. ముందుగా రజనీకాంత్‌ జ్వోతి ప్రజల్వన గావించారు. ఈ సినిమా దేశభక్తియుతమైన కథతో రూపొందుతోందని తెలుస్తోంది. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌, ఫాజిల్‌, మంజువారియర్‌, రానా, రితికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
rajani with lyca team
rajani with lyca team
లైకా ప్రొడక్షన్‌ బేనర్‌పై సుభాస్కరన్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నారు. అనిరుద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అమితాబ్‌తో  దాదాపు 32 ఏళ్ళ తర్వాత రజనీకాంత్‌ చేస్తున్న చిత్రమిది. జ్ఞానవేల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.