శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (23:16 IST)

"ది వారియర్" చిత్రంలో 'విజిల్ మహాలక్ష్మి'గా కృతిశెట్టి (video)

రామ్ హీరోగా కోలీవుడ్ దర్శకుడు ఎన్.లింగుస్వామి తెరకెక్కిస్తున్న ద్విబాషా చిత్రం "ది వారియర్". ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది లింగుస్వామికి తొలి ద్విభాషా చిత్రం కాగా, ఈ చిత్రం ద్వారా రామ్ పొత్తినేని కోలీవుడ్‌కు హీరోగా పరిచయంకానున్నారు. 
 
అయితే, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్తను చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో విజిల్ మహాలక్ష్మిగా ఉప్పెన భామ కృతిశెట్టి కనిపించనున్నారు. ఈ పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో కృతి ఒక ట్రెండీగా కూల్ లుక్‌లో షర్ట్, జీన్స్ ధరించి స్కూటర్ నడుపుతోంది. ఆమె పాత్ర పేరు విజిల్ మహాలక్ష్మిగా ఈ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. 
 
ఇప్పటికే విడుదలైన హీరో ఫస్ట్ లుక్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇందులో అక్షర గౌడ కీలక పాత్రను పోషిస్తుంది. ఆది పనిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలను సమకూర్చుతున్నారు. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.