శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (07:10 IST)

'ఖైదీ నంబర్ 150' మెగా ఐటమ్‌కు బహిరంగ అవమానం?

"ఖైదీ నంబర్ 150" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా ఐటమ్ గర్ల్‌గా నటించిన భామ లక్ష్మీ రాయ్. ఈమె చేసిన 'రత్తాలు.. రత్తాలు' ఐటమ్ సాంగ్ చిత్రానికే హైలెట్‌గా నిలిచింది. అయితే, ఈ రత్తాలుకు బహిరంగంగా మా

"ఖైదీ నంబర్ 150" చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన మెగా ఐటమ్ గర్ల్‌గా నటించిన భామ లక్ష్మీ రాయ్. ఈమె చేసిన 'రత్తాలు.. రత్తాలు' ఐటమ్ సాంగ్ చిత్రానికే హైలెట్‌గా నిలిచింది. అయితే, ఈ రత్తాలుకు బహిరంగంగా మాత్రం అన్యాయం జరిగిందట. దీంతో ఆమె అవమానభారంతో కుంగిపోతోందట. ఇంతకీ ఆ అన్యాయం ఏంటనే కాదా మీ సందేహం.. అయితే, ఈ కథనం చదవండి. 
 
'ఖైదీ నెం.150'లోని 'రత్తాలు రత్తాలు..' ఐటమ్ సాంగ్‌లో చిరు-లక్ష్మీరాయ్ రెచ్చిపోయి స్టెప్పులేశారు. ఈ ఐటమ్ వచ్చినప్పుడు థియేటర్ దద్దర్లిపోతోంది. మెగా అభిమానులు చిరు మాస్ స్టెప్పులు, లక్ష్మీరాయ్ అందాలని చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
 
అయితే, థియేటర్స్ మెగా ఐటమ్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చినా... బహిరంగంగా తనకి అన్యాయం చేశారని తెగ ఫీలైపోతుందట లక్ష్మీరాయ్. ఎందుకంటే..? ఖైదీ నెం.150 వాల్ పోస్టర్లలో రత్తాలుకి స్థానం లేదు. ఒక్క పోస్టర్‌లో కూడా రత్తాలు కనిపించక పోవడంతో తెగ ఫీలై పోతుందట. 
 
రత్తాలు బాధని మెగా ఖైదీ చిత్రబృందం కూడా గుర్తించిందట. అందుకే మూడో వారం నుంచి లక్ష్మీరాయ్ అందాలతో కూడా కొత్త పోస్టర్లని తీసుకురానున్నారు. దీంతో.. థియేటర్స్‌లోనే కాదు.. బయట కూడా మెగా ఐటమ్ అందాలని ఆస్వాదించొచ్చన్న మాట.