Sony LIV రాబోయే తెలుగు సిరీస్ బెంచ్ లైఫ్‌తో కార్పొరేట్ జీవితం గురించి నవ్వుకోండి
మీరు కార్పోరేట్ జీవితపు సుడిగుండంలో చిక్కుకున్నట్లు ఎప్పుడైనా గుర్తించారా? ఆ వాస్తవికతను మీరు మిస్ చేయకూడదనుకునే కామెడీగా మార్చడానికి వస్తోంది Sony LIV తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్, బెంచ్ లైఫ్. కార్పొరేట్ వెట్టిచాకిరీకి సంబంధించి తరచుగా ఒత్తిడితో కూడిన ప్రపంచాన్ని బెంచ్ లైఫ్ తాజాగా, ఉల్లాసంగా అందిస్తుంది. మానస శర్మ దర్శకత్వం వహించిన ఈ కామెడీ-డ్రామా అందరినీ ఎంతగానో నవ్విస్తుంది. కేవలం పనిలేకుండా కూర్చోవడమే కాదు-ఇది కొత్త అభిరుచులను కనుగొనడం, అసలేమాత్రం ఊహించని ప్రదేశాలలో ఏదో ఒక ప్రయోజనాన్ని కనుగొనడం ఇందులో ఉంటాయి. హాస్యం, హృదయం, భారతదేశంలోని సమకాలీన పని సంస్కృతిపై ప్రత్యేకమైన దృక్పథంతో, ఈ సిరీస్ తమ కెరీర్ మార్గాన్ని ప్రశ్నించుకునే ఎవరికైనా అది తమదే అనుకునేలా రూపొందించబడింది.
ఈ సందర్భంగా బెంచ్ లైఫ్ నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ, “కార్పోరేట్ బెంచ్‌లో ఉన్న ప్రత్యేకమైన అనుభవాన్ని చూపించే ఒక షోను రూపొందించాలనుకున్నాం. బెంచ్ పైన ఉండడం అనేది ఉద్యోగులు తరచుగా ఏదో కోల్పోయినట్లు మరియు అనిశ్చితంగా భావించే ప్రదేశం. కానీ ఎన్నో అనుకోని పరిస్థితుల్లో కూడా, జీవితంలో వృద్ధి చెందే, కలలు నెరవేరే అవకాశాలు ఉన్నాయని బాలు, మీనాక్షి, ఇషా, రవి, అతని స్నేహితుల ద్వారా మేము చూపిస్తున్నాం. బెంచ్ లైఫ్ అనేది తిరిగి కోలుకోవడం, స్నేహం, ఆనందాన్ని వేడుక చేసుకోవడం అని అన్నారు.
ఈ ధారావాహికలో వైభవ్ రెడ్డి, రితికా సింగ్, ఆకాంక్ష సింగ్, చరణ్ పేరి వంటి నటీనటులతో పాటు రాజేంద్ర ప్రసాద్, తులసి, తనికెళ్ల భరణి వంటి ప్రముఖ నటులు నటించారు. కథకు గాఢతను అందించారు. హాస్యాన్ని జోడించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రానికి పి.కె. దండి తన సంగీతంతో జీవం పోశారు. సినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్.