కొత్త ఉషస్సు కోసం చూస్తోన్న లావణ్య త్రిపాఠి
జీవితంలో ప్రతిరోజూ కొత్త ఉషస్సు కోసం చూడాలని లావణ్య త్రిపాఠి పాఠాలు చెబుతోంది. కొత్త వారం కొత్త ఆశతో ప్రారంభించాలని చెబుతోంది. అందుకే వారంలో మొదటి రోజైన సోమవారంనాడు తన ఫాలోవర్స్ కొన్ని టిప్స్ చెప్పింది. తను రోజువారీ శారీరక వ్యాయామం, యోగాతో రోజును ప్రారంభించడాన్ని ఇష్టపడుతుంది. వీలుంటే తప్పని సరిగా స్విమ్మింగ్ చేస్తానని తన ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఉదయమే లేచి సూర్యోదం చూడాలని కొత్త ఉషస్సు ఆయన్మనుంచి ఆస్వాదించాలని వెల్లడిస్తోంది.
ఎ1 ఎక్స్‌ప్రెస్, సోగ్గాడే చిన్నినాయనా, చావు కబురు చల్లగా వంటి చిత్రాల్లో నటించిన ఆమె కరోనా తర్వాత వెబ్ సిరీస్‌పై కాన్‌సన్ ట్రేషన్ చేసింది. ఇప్పికే పలు ఆఫర్లు వస్తున్నాయనీ తెలియజేస్తోంది. ఏదీ జీవితంలో మనం అనుకున్నట్లు జరగదు. కొన్ని విషయాలు మనం పట్టించుకోకూడదని సూక్తులు కూడా వల్లించింది. మరి దీని వెనుక అర్థం ఏమిటనేది వెల్లడించలేదు. త్వరలో ఏదైనా కొత్త విషయం చెబుతుందేమో చూడాలి.