శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 4 మే 2021 (09:28 IST)

ద‌ర్శ‌కుల‌కు గౌర‌వాన్ని తెచ్చిపెట్టిన దాస‌రి

Dasari
సినిమాల్లో హీరోకే ప్రాధాన్య‌త‌. అలాంటిది ద‌ర్శ‌కుడు లేనిదే హీరో ఎలా పుట్టుకొస్తాడు. క‌థ‌ను రాసి అత‌న్ని హీరోగా చేసేది ద‌ర్శ‌కుడే. అందుకే ద‌ర్శ‌కుల‌కు గౌర‌వం ఇవ్వాల‌ని ఘంటాప‌దంగా వాదించి సాధించిన ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు. అందుకే ఆయ‌నకు ద‌ర్శ‌క‌ర‌త్న అని బిరుదు ప‌రిశ్ర‌మ ఇచ్చింది. ఆయ‌న జ‌యంతి మే4. ఈరోజే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జీవితంలో ఎన్నో మ‌లుపులు, ఎత్తుప‌ల్లాలు, కోప‌తాపాలు ఎన్నింటినో అనుభ‌వించారు. ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచి శిష్యుల‌ను త‌యారుచేసుకున్నారు.
 
Dasari, padma
ఇక త‌న భార్య ప‌ద్మ అంటే ఆయ‌న‌కు అమిత‌మైన ప్రేమ‌. ఆయ‌న విజ‌యానికి వెనుక ఆమె వుంద‌ని చెప్పేవారు. రేలంగి న‌ర‌సింహారావు, నారాయ‌ణ‌మూర్తి, శివ‌నాగేశ్వ‌ర‌రావు ఇలా ఎంతో మంది ఆయ‌న ఇంటిముందు ఆయ‌న చూపు కోసం ఎదురుచూస్తుండేవారు. వారంద‌రికీ ప‌ద్మ అవ‌స‌రంరీత్యా వారు కూడా ద‌ర్శ‌కులు అవ్వాల‌నే అడ్వాన్స్‌కూడా ఇచ్చేది ఈ విష‌యాల‌ను రేలంగిగారు ప‌లు సంద‌ర్భాల‌లో చెప్పేవారు. అలాంటి ఆయ‌న ఎత్తుప‌ల్లాలు ఎన్నో చ‌విచూశారు.
 
Mohanbabu, dasari
కొత్త‌వారితో స్వ‌ర్గం న‌ర‌కం
ఏ ముహూర్తాన స్వ‌ర్గం న‌రకం సినిమాను ఆరంభించాడో అది ఊహించ‌ని విజ‌యాన్ని సాధించింది. ఆయ‌న జీవితంలోనూ స్వ‌ర్గం న‌ర‌కం రెండూ అనుభ‌వం ఇచ్చామ‌ని ఆ చిత్ర విజ‌యోత్స‌వ స‌భ‌లో పేర్కొన్నారు. ఆ సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని పొందాడు. అందులోనే మోహ‌న్‌బాబు అనే న‌టుడుని వెలుగులోకి తెచ్చింది. అప్ప‌టినుంచి ఆయ‌న్ను గురువుగారు అని సంబోధిస్తుంటాడు.
 
1942, మే 4న పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో జన్మించారు. అత్యధిక చిత్రాల చేసిన దర్శకుడుగా గిన్నిస్‌ రికార్డ్ అందుకున్నారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాదు ,  53 సినిమాలు నిర్మించాడు. 250 పైగా చిత్రాలకు సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి పలు అవార్డులు రివార్డులు అందుకున్నారు. అక్కినేనితో తీసిన ప్రేమాభిషేకం సెన్సేష‌న‌ల్ హిట్ అయింది. ఏడంత‌స్తుల మేడ సినిమా అదో రికార్డ్‌. క‌ళాకారుల జీవితం ఎలా వుంటుందో ఇందులో చూపించాడు.

రాజ్యసభకు ఎన్నిక 
త‌క్కు కాలంలో ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన సినీపరిశ్రమే కాకుండ కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యాడు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించాడు. దాసరి నటించిన సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. తాతా మనవడు సినిమాకి గాను నంది అవార్డు అందుకున్నాడు.
 
nag, dasari, laxmi
దాసరి అభిమాన‌సంఘాలు
కళాశాలలో చదివేరోజులలో బీ.ఏ డిగ్రీతో పట్టబధ్రుడు అవటంతో పాటు దాసరి అనేక నాటకపోటీలలో కూడా పాల్గొనేవాడు. అనతి కాలంలోనే ప్రతిభ గల రంగ స్థల నటుడిగా, నాటక రచయితగా చిత్ర దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. ఒకానొక సమయంలో ఈయన పేరిట 18,000 కు పైగా అభిమానసంఘలు ఉండేవి.

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఈయన ప్రాచుర్యానికి అద్దం పడుతుంది. దాసరి తిసిన బొబ్బిలి పులి , సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి అనడం అతిశయోక్తి కాదు.   కృషితో నాస్తి దుర్భిక్షం అనే పదానికితెలుగు సినీరంగంలో ఉదాహరణగా ఈయన గురించి చెబుతారు. ఈయన అనేకమంది కొత్త కళాకారులను సినీరంగానికి పరిచయం చేసి తారలు అయ్యేందుకు దోహదపడ్డాడు. దాసరి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Rajendra, Sivakrishan,dasari
కారులు బారులు తీరి వుండేవి
అయితే కాలానుగుణంగా మార్పుల‌కు ఆయ‌న ఇమ‌డ‌లేక‌పోయారు. ఒక‌ప్పుడు చెన్నైలో ఆయ‌న ఇంటి ముందు కారులు బారులు తీరి వుండేవి. బొబ్బిలి సింహం వంటి సినిమాలు ఎన్‌.టి.ఆర్ కెరీర్‌ను మార్చేశాయి. అలాంటి ఆయ‌న ఆ త‌ర్వాత వ‌చ్చి సాంకేతిక‌, యువ‌త ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా క‌థ‌లు రాసుకోలేక‌పోయారు. అవి తీసినా విజ‌య‌వంతం కాలేక‌పోయాయి. ఓ ద‌శ‌లో ఆయ‌న పుట్టిన‌రోజంటే జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న ఇంటి వీధి మొత్తం కారులు బారులు తీరేవి. బొగ్గు మంత్రిగా వున్న‌పుడు రాజ‌కీయ నాయ‌కులు, వివిధ పార్టీల వారు వ‌చ్చి ఆయ‌న ఆశీర్వాదం తీసుకునేవారు అలాంటి స్థితినుంచి ఓ ద‌శ‌లో వేల్ళ‌మీద లెక్కించేంత‌గా ఆయ‌న స‌న్నిహితులు మాత్ర‌మే వ‌చ్చి పుట్టిన‌రోజునాడు శుభాకాంక్ష‌లు తెలియ‌జెప్పేవారు.
 
సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుండే దాసరి కార్మిక సంఘాలకు ఎంతో తోడ్పాటు అందించారు. ఆయన పుట్టినరోజును దర్శకుల దినోత్సవంగా తెలుగు పరిశ్రమ జరుపుకోవడం విశేషం. దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, నిర్మాతగా, లీడర్ గా భిన్నమైన పాత్రలు పోషించిన దాసరి తెలుగు సినిమాకు కేసరి లాంటి వారు. అలాంటి అయన తీవ్ర అనారోగ్యం కారణంగా సికిందరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2017 మే 30న తుదిశ్వాస విడిచారు.