శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (15:27 IST)

"MAA" భ‌వ‌నాన్ని హీరోలు క‌ట్ట‌లేరా..? మోహన్ బాబు, చిరు ఇన్వాల్వ్ అయితే...

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సొంత భ‌వ‌నం కోసం విదేశాల‌కు వెళ్లి అక్క‌డ స్టేజ్ పొగ్రామ్స్ చేసి వ‌చ్చిన డ‌బ్బుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సొంత భ‌వ‌నం క‌ట్టాల‌నుకున్నార‌ట‌. అయితే... దీని కోసం విదేశాల‌కు వెళ్ల‌డం అక్క‌డ ఎమౌంట్ వ‌సూలు చేయ‌డం వివాద‌స్ప‌దం అ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ సొంత భ‌వ‌నం కోసం విదేశాల‌కు వెళ్లి అక్క‌డ స్టేజ్ పొగ్రామ్స్ చేసి వ‌చ్చిన డ‌బ్బుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సొంత భ‌వ‌నం క‌ట్టాల‌నుకున్నార‌ట‌. అయితే... దీని కోసం విదేశాల‌కు వెళ్ల‌డం అక్క‌డ ఎమౌంట్ వ‌సూలు చేయ‌డం వివాద‌స్ప‌దం అయ్యింది. మా ప్రెసిడెంట్ శివాజీరాజా నిధుల‌ను దుర్వినియోగం చేసార‌ని న‌రేష్ ఆరోపిస్తుండ‌టం.. దీనికి శివాజీరాజా అలాంటిది ఏం జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌డం జ‌రిగింది. ఈవిధంగా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం అటు ఆడియ‌న్స్‌లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది.
 
అస‌లు... MAA భ‌వ‌నం క‌ట్టాలంటే నిధులు కోసం విదేశాల‌కు వెళ్లాలా..? హీరోలు ఆర్థిక సాయం చేస్తే స‌రిపోతుంది క‌దా? దీనికి విదేశాల వ‌ర‌కు వెళ్ల‌డం ఎందుకు అనే ప్ర‌శ్న మొద‌లైంది. రోజురోజుకు ఈ వివాదం మ‌రింత ముదురుతుంది. ఇండ‌స్ట్రీ పెద్ద దిక్కు దాస‌రి గారు చ‌నిపోవ‌డంతో ప‌ట్టించుకునే వారు, అడిగేవారు లేర‌ని ఇలాంటివి జ‌రుగుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి... చిరంజీవి కానీ, మోహ‌న్ బాబు కానీ క‌ల్పించుకుని ఇలాంటివి జ‌ర‌గ‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంది.