శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (11:42 IST)

శివరాత్రి జాగరణ చేసిన శ్రీముఖి.. శివుని బొమ్మను గీసి..?

Srimukhi
బుల్లితెర యాంకర్స్‌లో శ్రీముఖి చాలా పాపులర్. ఈమెకు భారీగా అభిమానులు వున్నారు. అంతేగాకుండా బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తుంది.

తాజాగా క్రేజీ అంకుల్ అనే సినిమాలో శ్రీముఖి నటించగా, ఈ సినిమా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రేయాస్ మీడియా నిర్మిస్తోన్న ఈ మూవీ మనీ ఫేం డైరెక్టర్ శివనాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ప్రముఖ గాయకుడు మనో, రఘుకుంచె , రాజా రవీంద్ర కీలక పాత్రలో నటించారు.
 
శ్రీముఖి ఇటు బుల్లితెర అటు వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోను తెగ సందడి చేస్తుంటుంది. ఈ మధ్య హాట్ హాట్ పిక్స్ షేర్ చేసి హీటెక్కించిన శ్రీముఖి శివరాత్రి సందర్భంగా షాకింగ్ విషయం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

జాగరణ చేసిన తాను శివుని బొమ్మను అద్భుతంగా గీసానని చెబుతూ అందుకు సంబంధించిన ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.