శనివారం, 25 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (10:47 IST)

"భరత్ అనే నేను" టీజర్ మార్చి 6న వచ్చేస్తోంది...

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ''భరత్ అనే నేను''. ఈ సినిమా టీజర్ మార్చి 6న విడుదల కానుంది. మహేష్ బాబు, కైరా అద్వాని, కొరటాల కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఆత్రుతత

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం ''భరత్ అనే నేను''. ఈ సినిమా టీజర్ మార్చి 6న విడుదల కానుంది. మహేష్ బాబు, కైరా అద్వాని, కొరటాల కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ''ది విజన్ ఆఫ్ భరత్'' పేరుతో మార్చి 6న ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఓ ఫోటోను విడుదల చేస్తూ వెల్లడించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఇక స్పైడర్, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో అభిమానులను నిరాశ పరిచిన మహేష్ బాబు..  'భరత్ అనే నేను' చిత్రం ద్వారా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు సీఎంగా కనిపించనున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.
 
ఈ ఫస్ట్ లుక్‌లో ''ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను' అంటూ మహేష్ ప్రమాణం చేసే వ్యాఖ్యలున్న సంగతి తెలిసిందే.