మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 10 ఫిబ్రవరి 2018 (11:20 IST)

పవన్‌తో సినిమా చేస్తా.. టైటిల్ ఏంటో తెలుసా?: మహేష్ సోదరి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల సై అంటున్నారు. నాన్నగారు, మహేష్ బాబు తర్వాత తాను ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ మంజుల తెలిపారు. పవన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల సై అంటున్నారు. నాన్నగారు, మహేష్ బాబు తర్వాత తాను ఎక్కువగా అభిమానించే వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ మంజుల తెలిపారు. పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి దిగేముందు తన సినిమాలో నటించాలని మంజుల కోరారు. 
 
తాను రాసిపెట్టిన కథలో హీరోగా నటించిన తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వెళ్ళొచ్చునని మంజుల వ్యాఖ్యానించారు. పవన్‌లోని నిజాయితీ తనకు బాగా నచ్చుతుందని.. ఆయన కోసం తాను ఓ కథ కూడా రాసుకున్నానని చెప్పుకొచ్చింది. 
 
ఆ కథకి ''పవన్'' అనే టైటిల్ కూడా పెట్టేశానని.. తాను రాసిన కథ పవన్ వినాలే కానీ.. ఆయనకు తప్పకుండా అది నచ్చుతుందనే నమ్మకం వుందని మంజుల చెప్పుకొచ్చారు. ఒకసారి ఈ కథ వినమని మీరైనా చెప్పండంటూ మంజుల మీడియా మిత్రులను కోరారు.
 
ఇకపోతే.. మంజుల దర్శకత్వంలో ''మనసుకు నచ్చింది'' సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో సందీప్ కిషన్- అమైరా దస్తూర్ జంటగా నటిస్తున్నారు. 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.