శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: గురువారం, 8 ఫిబ్రవరి 2018 (18:17 IST)

పార్లమెంటులో కె. కవిత 'జై ఆంధ్ర'... పవన్ కళ్యాణ్ 'తెలంగాణ'

పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. గురువారం నాడు పార్లమెంటులో నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చాలంటూ ఏపీ ఎంపీల నిరసనలకు త

పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. గురువారం నాడు పార్లమెంటులో నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ కేంద్రం నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చాలంటూ ఏపీ ఎంపీల నిరసనలకు తాము మద్దతు తెలుపుతున్నట్లు కవిత తెలిపారు. కేంద్రం ఇచ్చిన హామీలను సత్వరమే నెరవేర్చాలనీ, తెదేపా ఎంపీలు చేస్తున్న డిమాండులో న్యాయం వుందని ఆమె అన్నారు. 
 
తన ప్రసంగాన్ని ముగిస్తూ చివర్లో 'జై ఆంధ్రా' అంటూ ముగించారు. మరోవైపు గురువారం నాడు హైదరాబాదులో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రెండు రాష్ట్రాలకు ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఇస్తామన్న నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఎంతో వున్నా, వాటిని పట్టించుకోవడం లేదనీ, అందుకే మేధావులతో సమావేశమై చర్చించి ముందుకు సాగాలనుకుంటున్నట్లు తెలిపారు.