మహేష్ బాబు గారాలపట్టి సితార చాక్లెట్ చేసేసింది.. అక్కడి వాళ్లంతా తిన్నారట..
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ ఉంది. అమ్మడు ఫోటోలకు నెటిజన్లు బ్రహ్మరథం పడతారు. గతంలో మహేష్ ముక్కుపై వేలేస్తూ సితార ఫోటోకు లైక్స్, షేర్స్ అదిరాయి. ఆపై సి
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ ఉంది. అమ్మడు ఫోటోలకు నెటిజన్లు బ్రహ్మరథం పడతారు. గతంలో మహేష్ ముక్కుపై వేలేస్తూ సితార ఫోటోకు లైక్స్, షేర్స్ అదిరాయి. ఆపై సితారకు సంబంధించి ఏ ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో వైరలే. తాజాగా మహేష్ డాటర్ సితార చాక్లెట్ తయారీ మొదలెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా రచ్చ రచ్చ చేస్తున్నారు.
సితార చాక్లెట్స్ తయారు చేస్తుండగా తీసిన ఫోటోలను.. సితార మదర్, మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన కూతురు రెడీ చేసిన చాక్లెట్‌ని అక్కడి వాళ్లంతా ఎంతో ఇష్టంగా తినేశారంటూ నవ్వుతూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ సినీ ప్రేక్షకులతో పాటు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.