శనివారం, 8 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (12:44 IST)

మురుగదాస్ సినిమా షూటింగ్ ఓవర్? ఫ్యామిలీతో ట్రిప్పేసిన మహేష్ బాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ సినిమాలో బిజీ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నప్పటికీ.. సమయం దొరికినప్పుడల్లా.. తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ సినిమాలో బిజీ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్నప్పటికీ.. సమయం దొరికినప్పుడల్లా.. తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు- రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న సినిమా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత వారం కూడా మహేష్ బాబు ఇంట్లో లేడట.
 
ఒక్కక్షణం కూడా ఫ్యామిలీతో గడపలేక పోలేతున్నాడట. అందుకే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి తర్వాత ఆహ్లాదకరమైన ప్రదేశంలో పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్ అయ్యింది. మహేష్‌ని ఈ లుక్‌లో చూసినవాళ్లు తలోవిధంగా చర్చించుకుంటున్నారు. 
 
రాకుమారుడు మూవీ స్టయిల్‌లో వున్నాడంటూ కామెంట్లు పోస్ చేస్తున్నారు. మురగదాస్ ప్రాజెక్ట్ అయ్యాక మహేష్ బాబు కొరటాలతో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేసినట్లు టాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి.