శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

మహేష్ బాబు ఖాతాలో అరుదైన రికార్డ్.. ట్రెండింగ్‌లో#11millionmaheshians

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. సోషల్ మీడియాలో మహేష్ బాబుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ట్విట్టర్‌లో మహేష్ అద్భుతమైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. 11 మిలియన్ల ఫాలోవర్స్‌తో సౌత్ హీరోలలో అగ్రస్థానంలో నిలిచాడు.

ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన సినిమాలకు టూర్లకు సంబంధించిన అప్డేట్లను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తుంటాడు. తనతోపాటు నమ్రతా శిరోద్కర్ గౌతమ్ సితారలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు మహేష్. ఇటు మాస్ అటు క్లాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 
 
ఇక కరోనా లాక్డౌన్ టైమ్‍లో మహేష్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌లో మహేష్ బాబు 11 మిలియన్ల క్లబ్‌లోకి చేరాడు. దక్షిణాది హీరోల్లో 11 మిలియన్ల క్లబ్‌లో చేరిన తొలిహీరో మహేష్ కావడం విశేషం. 
 
ఇప్పటికే మహేష్ కు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఫేస్ బుక్‌లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టాలీవుడ్‌లో ఎక్కువమంది ఫాలోవర్లున్న హీరోగా మహేష్ బాబు కొనసాగుతున్నారు. దీంతో #11millionmaheshians అన్న హ్యష్ ట్యాగ్ ను మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ టైం రికార్డ్ అంటూ దూకుడులో మహేష్ బాబు చెప్పిన డైలాగ్‌తో మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.