గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (18:26 IST)

11 మిలియన్ ప్లస్‌కు చేరిన మ‌హేష్‌

మహేష్‌ బాబు సినిమా అంటేనే ప్రేక్ష‌కుల్లో క్రేజ్‌.. కొత్త హీరోయిన్లు సైతం మ‌హేష్‌బాబు స‌ర‌స‌న న‌టించాల‌ని అనుకుంటారు. అలాంటి మ‌హేష్‌బాబుకు క్లాస్‌తోపాటు మాస్ ఇమేజ్ కూడా వుంది. ఆయ‌న చిత్రాలు ఎప్పుడు విడుల‌యినా ఎక్క‌డ విడుదలైనా ఫాలోయింగ్ బాగుంటుంది. 
 
'పోకిరి' ఎన్నిసార్లు బుల్లితెర‌పై వేసినా దానికి మంచి రేటింగే వుంటుంది. అలాగే 'స‌రిలేరు నీకెవ్వ‌రూ'. కాగా, మ‌హేష్ ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కలిగిన సౌత్ హీరోగా రికార్డ్ సాధించారు. మహేష్‌ బాబును సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 11 మిలియన్ ప్లస్‌కు చేరింది. 
 
కరోనా లాక్డౌన్‌ టైమ్‌ నుంచి మహేష్‌ బాబు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. అభిమానులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూ ట్వీట్స్‌ చేస్తుంటాడు. మహేష్ 11 మిలియన్ల క్లబ్‌లోకి చేరడంతో.. #11millionmaheshians హ్యష్ ట్యాగ్‌ను సోషల్ మీడియా‌లో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మ‌రి మ‌హేష్ అంటేనే చార్మింగ్ హీరో క‌దా.