బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2017 (10:46 IST)

మహేష్ బాబు ప్రోగ్రామ్.. ఐస్ క్రీమ్‌లో జెర్రీ.. కెమెరామెన్ గట్టిగా అరిచేశాడు..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మురుగదాస్ సినిమా విషయంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఇంకా టైటిల్ కూడా రెడీ కాలేదు. ప్రస్తుతానికైతే మూడు టైటిల్స్‌ను ఎంపిక చేసి ఫైనల్ డెసిషన్ మాత్రం మురుగదాస్‌కు అప్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మురుగదాస్ సినిమా విషయంలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఇంకా టైటిల్ కూడా రెడీ కాలేదు. ప్రస్తుతానికైతే మూడు టైటిల్స్‌ను ఎంపిక చేసి ఫైనల్ డెసిషన్ మాత్రం మురుగదాస్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు వీలైనంత తొందరగా ఈ టైటిల్‌ను ప్రకటించాలని ఆలోచిస్తున్నారు.

ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా ప్రారంభించి ఎన్ని రోజులు అయినా ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన పోస్టర్ గానీ, టీజర్ గానీ, మహేష్ లుక్ గానీ ఏది బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
 
ఈ నేపథ్యంలో హీరో మహేష్‌బాబు ఓ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆ కార్యక్రమం హైదరాబాదులోని ఓ స్టార్ హోటల్‌లో జరిగింది. అయితే హోటల్‌లోని ఐస్ క్రీమ్‌లో జెర్రి కనిపించడం కలకలం రేపింది. హైదరాబాద్ సిటీలో స్టార్ హోటల్‌లో గురువారం జరిగిన ఓ ఆన్‌లైన్‌ టీవీఛానల్‌ ఈవెంట్‌కి మహేష్‌బాబు గెస్ట్‌గా హాజరయ్యాడు. కార్యక్రమం తర్వాత అతిథులకు భోజనాలు ఏర్పాటుచేశారు.
 
ఓ పత్రిక కెమెరామన్‌ ఫుడ్ తర్వాత ఐస్‌క్రీమ్‌ తింటుండగా అందులో జెర్రి కనిపించింది. ఒక్కసారి షాకైన అతడు గట్టిగా అరిచాడు. దీంతో అక్కడ భోజనాలు చేసేవారు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని హోటల్‌ వర్గాల దృష్టికి తీసుకెళ్లారు.