బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

అదిరిపోయిన ప్రిన్స్ మహేశ్ బాబు న్యూలుక్ (వీడియో)

mahesh babu
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు న్యూలుక్ అదిరిపోయింది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకునేందుకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌కు వెళ్లారు. ఈ వేడుకలు ముగించుకుని నగరానికి పయనమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొత్త గెటప్‌‍లో కనిపించారు. 
 
జైపుర్‌ ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబసభ్యులతో కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో మహేశ్‌ న్యూ లుక్‌తో దర్శనమిచ్చారు. పోనీ టెయిల్‌, గుబురు గడ్డంతో సినీ ప్రియులను అబ్బురపరిచారు. దీనిని చూసిన నెటిజన్లు.. ‘వావ్‌’ అని కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసమే ఆయన ఈ లుక్‌లోకి మారినట్లు భావిస్తున్నారు. 
 
భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. 
 
దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'మహారాజ్‌' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాక్‌. వెండితెరపై సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు. మహేశ్‌కు సంబంధించి మొత్తం ఎనిమిది లుక్స్‌ను దర్శకుడు రాజమౌళి బృందం సిద్ధం చేసినట్టు సమాచారం.