#SSMB29 అన్ని చిత్రాలకు "బాప్" అవుతుంది: ఆర్జీవీ కితాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు- SS రాజమౌళి #SSMB29 పేరుతో గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది.
ఇప్పటికే రాజమౌళి "RRR"తో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ హాలీవుడ్ స్టూడియో రాజమౌళితో కలిసి పనిచేస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. తాజాగా రాజమౌళిని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు గుప్పించారు.
రాజమౌళి మెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ, #SSMB29 అన్ని చిత్రాలకు "బాప్" అవుతుందని కితాబిచ్చారు. ఇది భారతీయ చలనచిత్ర రూపురేఖలను మారుస్తుందని చెప్పారు.
ఆర్జీవీ కామెంట్స్‌తో మహేష్ బాబు ఫ్యాన్స్ హ్యాపీగా వున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.