ఆదివారం, 15 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (12:10 IST)

కల్కి 2898 AD చిత్రం సామాన్య ప్రేక్షకులను అలరిస్తుందా? రివ్యూ రిపోర్ట్

Kamal Haasan
ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న సినిమా రానేవచ్చింది. ఇండియన్ సినిమాకి చెందిన  మెగా స్టార్స్ నటించిన చిత్రం కల్కి 2898 AD. అందులో ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌ను 39 సంవత్సరాల తర్వాత ఒకచోట చేర్చిన మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD'. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రామ్ గోపాల్ వర్మ,  రాజమౌళి, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. ఈరోజు తెల్లవారు జామున విడుదలైన ఈ సినిమా ఎలావుందో చూద్దాం.
 
Klaki new poster
Klaki new poster
కథ.
మహాభారతం యుద్ధం చివరి దశలో అశ్వద్థామ పాండవుల నాశనం కోరుతూ శపిస్తూ ఓ ఆయుధం విసురుతాడు. దీనికి క్రిష్ణుడు కోప్పడి అతన్ని శపిస్తాడు. కలియుగం అంతం వరకు నువ్వు భూలోకంలోనే సజీవంగా వుంటూ, నా అవతారం కల్కి పుట్టుక వరకు వుండి కాపాడమంటాడు. (ఇదంతా కార్టూన్ ప్రయోగంలో వుంటుంది)
 
అలా యుద్ధం తర్వాత ఎన్నో ఏళ్ళు భూమిలో విదేశీయులు, రాజులు, పాలకులు పాలిస్తూ వుండడం, ఆ తర్వాత వారంతా కనుమరుగయి కలియుగ అంతం కాశీలో చివరి పట్టణంకు కథ మారుతుంది. అక్కడ మనుషులు ఫ్యూచర్ జనరేషన్.  వారు టెక్నాలజీ ఉపయోగించదడంలో దిట్ట. ఎగురుతూ ప్రయాణం చేయగలరు. వాహనాలతో వెళ్ళగలరు. కానీ వారికి తినడానికి, తాగడానికి నీటి సమస్య. 
 
అవేమీలేకుండా కాశీకి ఫైన కాంప్లెక్స్ అనే లోకం వుంటుంది. అక్కడ అన్నీ సౌకర్యాలుంటాయి. అక్కడికి వెళ్ళాలనేది ఆ పక్కనే వున్న శంబాలా నగరవారుసుల కోరిక కూడా. శంబాలవాసులకు, కాంప్లెక్స్ వాసులకు యుద్ధం జరుగుతుంది. అందులో భైరవ (ప్రభాస్) పాత్ర ఏమిటి? క్రిష్ణుడు శపించిన అశ్వత్థామ ఏమి చేశాడు. కల్కి ఎవరి గర్భంలో జనిస్తాడు? అతడిని కాపాడుకునేందుకు అశ్వత్థామ (అమితాబ్) ఏం చేశాడు? కమల్ హాసన్ పాత్ర ఏమిటి? అనేది కథ.
 
సమీక్ష:
ఈ సినిమా చూస్తున్నంతసేపు స్టార్ వార్స్ సినిమా గుర్తుకు వస్తుంది. దాన్ని స్పూర్తిగా తీసుకుని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించాడు. మన భారతానికి లింక్ చేస్తూ కలియుగం ఎండింగ్‌లో ఏమి జరగబోతోంది. అనేది రెండు భాగాలుగా తీశాడు. ఈరోజు విడుదలైన మొదటి భాగంలో కేవలం దీపికా పదుకొనే గర్భంలో వున్న కల్కిని రక్షించడానికి అశ్వత్థామ ఏం చేశాడు. బైరవ ఎటువైపు పోరాడాడు? అన్నది ఆసక్తికరంగా చూపించాడు.
 
ఈ పోరాటం బుజ్జి వాహనంపై జరుగుతుంది. అందులో భాగంగా రాజమౌళి కూడా మరో వాహనంలో కనబడి.. నా దగ్గర అన్నీ నేర్చుకుని వెళ్ళిపోయావ్ అని ప్రశ్నిస్తే.. అమ్మో.. ఐదేళ్ళు నీదగ్గర వుండలేను అని స్పీడ్ గా కారులో ప్రభాస్ వెళ్ళిపోతాడు. ఈసారి పదేళ్ళు పదలను అంటూ రాజమౌళి అంటాడు. ఇలా సరదాగా ఓ చిన్న సీన్ సాగుతుంది.
 
దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ
దుల్కర్ సల్మాన్ చెడుపై పోరాడే వ్యక్తిగా శంబాలా వాసిగా ఒక్క సీన్లో కనిపిస్తాడు. విజయ్ దేవరకొండ మహాభారత యుద్ధంలో అర్జునుడిగా కనిపిస్తాడు. ప్రభాస్ ఎవరనేది ఇంటర్ వెల్ ముగింపు వరకు చూస్తేకానీ అర్థంకాదు. అయితే ఈ సినిమాలో కర్ణుడు పాత్ర ఎవరనేది కరెక్ట్‌గా చూపించాడు. ఫేస్ అంతా చీకటిగా పెట్టి షాట్ తీశాడు.
 
కమల్ హాసన్ సుప్రీంః
ఈ సినిమాలో కాంప్లెక్స్ సృష్టికర్త సుప్రీంగా కమల్ నటించాడు. ఆయన బక్కచిక్కి శల్యమై జీవచ్ఛంగా వున్న బాడీతో వుంటాడు. దానినుంచి యవ్వనంగా రావాలంటే.. కల్కి పుట్టే గర్భంలో వున్న మహిళ సీరమ్ తన బాడీలోకి ఎక్కించాలి. అప్పుడు విశ్వాన్ని శాసిస్తాడు.
 
ప్రాజెక్ట్ కె. అంటే?
ఇంచుమించు ఇదే పాయింట్ సమంత నటించిన యశోదలో వుంటుంది. వందలమంది గర్భిణీలను తీసుకువచ్చి ప్రయోగాలు చేస్తుంటారు. సమంత వాటిని బ్రేక్ చేస్తుంది. కల్కిలో కూడా మహిళ గర్భంలోని సీరం కోసం వందలాది గర్భిణీలను ప్రాజెక్ట్ కె. పేరుతో వారి గర్భం నుంచి సిరమ్ తీసుకుని సుప్రీం తన బాడీలో ఎక్కించుకునే ప్రయత్నం చేస్తాడు. ఎవరికీ సెట్ కాదు. అలా కానివారిని చంపేస్తుంటాడు. చివరికి దీపికా గర్భం సెట్ అవుతుంది. అందులో ఒక్క చుక్క మాత్రమే దక్కించుకుంటాడు. ఆ తర్వాత ఆమెను దైవశక్తి కాపాడుతుంది. అదే అశ్వత్థామ పాత్ర.
 
అమితాబ్ హీరో
ఈ భాగంలో అసలు హీరో అమితాబ్ పాత్ర. అశ్వథ్థామగా ఎనిమిది అడుగుల ఎత్తులో బాగా ఆకట్టుకోవడమేకాకుండా సుప్రీం సైనికులతోనూ యుద్ధం చేస్తాడు. చివరికి అశ్వత్థామను భైవర (ప్రభాస్) కూడా ఎదిరిస్తాడు. ఆ పోరాటంలో భైరవ ఎవరనేది ఆయనకు గోచరమవుతుంది. ఈలోగా సుప్రీం అసలు యవ్వనం వచ్చి కమల్‌గా మారిపోతాడు. నేను దేవుడితో యుద్ధానికి వెళతానంటూ డైలాగ్ వుంటుంది. దాంతో కల్కి మొదటి భాగం పూర్తి.
 
సెకండ్ పార్ట్‌లో అసలు కల్కి ఎలా పుట్టాడు? అసలు కల్కి అవతారం ఎవరనేది తెలస్తుంది. 
 
ఈ సినిమాలో వింతలోకాలు,  వింత వాహనాలు, యాక్షన్ సీన్స్ స్టార్ వార్స్ సినిమాను తలపిస్తాయి. టెక్నికల్‌గా హై స్టాండెర్డ్స్‌లో తెలుగు సినిమాలో చూస్తాం. గతంలో రాజమౌళి బాహుబలి సినిమా ఒక లెక్క. నాగ్ అశ్విన్.. కల్కి ఒక లెక్కగా వుంటుంది. వింతలు, విశేషాలతో పాటు విజువల్‌గా ఫీస్ట్‌లా ఈ చిత్రం వుంది.

ఏది ఏమైనా కామన్ ప్రేక్షకుడు కూడా విజువల్ వండర్ ఈ సినిమాతో దర్శకుడు చూపించాడు. యాభై ఏళ్ళ అనుభవం వున్న అశ్వనీదత్ నిర్మించారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను తీశాడు. ఇందులో దాదాపు అన్ని భాషల నటీనటులు నటించారు. ఇది ఏ రేంజ్‌కు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.
 
రేటింగ్ : 3/5