సితార డ్యాన్స్ వీడియో మళ్లీ వైరల్.. మైండ్ బ్లాక్‌కి స్టెప్పులేసిన...? (video)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కుమార్తె సితారకు సోషల్ మీడియా క్రేజ్ అంతా ఇంతా కాదు. మహేష్ ముద్దుల కూతురు సితార తన తండ్రి సినిమాలకి సంబంధించి పాటలు పాడడం లేదంటే డ్యాన్స్‌లు చేయడం ఫ్యాన్స్‌కి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.
తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని ఫేమస్ సాంగ్ మైండ్ బ్లాక్‌కి తన దైన స్టైల్‌లో స్టెప్పులు వేసింది. ఈ డ్యాన్సుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు సితార వేసిన స్టెప్స్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
సితార తన డ్యాన్స్‌కి సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, వాటికి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది. తండ్రికి తగ్గ తనయ అని అనిపించావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సరిలేరు నీకెవ్వరు చిత్రం .. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో రష్మిక, విజయశాంతి ముఖ్య పాత్రలు పోషించారు. ఇంకేముంది... మైండ్ బ్లాక్ పాటకు సితార స్టెప్పులేసిన వీడియోను మీరూ ఓ లుక్కేయండి.