మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (10:22 IST)

బాలికకు నీలి చిత్రాలు చూపించి.. బాబాయే అత్యాచారం చేశాడు..

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు తాలూకా బసవరాజుపాళెంలో ఓ దారుణం జరిగింది. పొలంలో మేకలు మేపుకునేందుకు వెళ్ళిన మైనర్ బాలికపై బాబాయి వరుసైన కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆత్మకూరు మండలం బసవరాజుపాళెం గ్రామానికి చెందిన ఓ మైనర్‌ (12) మూడు రోజుల క్రితం మేకలు మేపేందుకు పొలానికి వెళ్లింది. ఆ బాలికపై బాబాయి వరసయ్యే యువకుడు తిరుపతయ్య అలియాస్ ఉరఫ్‌ సురేష్ ఎప్పటి నుంచో కన్నేసివున్నాడు. 
 
ఆ బాలిక మేకలు తోలుకుని వెళ్లడాన్ని గమనించిన తిరుపతయ్య వెంబడించి పొలంలో మాయమాటలు చెప్పాడు. సెల్‌ఫోనులో నీలిచిత్రాలు చూపించి ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఈ విషయాన్ని ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. తిరుపతయ్యను అరెస్టు చేశారు.